ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ‘దేవర’ సినిమా జపాన్‌లో మార్చి 28వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డైరెక్టర్ శివ కొరటాలతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్.. నాగచైతన్య నడుపుతున్న రెస్టారెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను జపాన్ ఫుడ్‌ని చాలా ఇష్టంగా తింటానని, హైదరాబాదులో జపాన్ ఫుడ్ తినాలని అనిపిస్తే కచ్చితంగా ‘షోయు’ రెస్టారెంట్‌కి వెళతానని చెప్పుకొచ్చాడు. ఆ రెస్టారెంట్ నా ఫ్రెండ్ నాగచైతన్యది. ఆ రెస్టారెంట్లో మనకు చాలారకాల జపాన్ ఫుడ్స్ లభిస్తాయి. అందులో సుషీ అనే జపనీస్ ఫుడ్ అంటే నాకు ఎంతో ఇష్టం అమేజింగ్‌గా ఉంటుందని తెలియజేశాడు. అప్పుడు ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌కి రీసెంట్ ఇంటర్వ్యూలో నాగ చైతన్య స్పందించాడు. ఎన్టీఆర్ తన సినిమా ప్రమోషన్ కోసం జపాన్‌కి వెళ్లి ఆ సమయంలో మా రెస్టారెంట్ గురించి మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు నాగ చైతన్య. ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ప్రీమియం క్లౌడ్ కిచెన్ పెట్టాలనే ఆలోచన నాకు లాక్‌డౌన్ సమయంలోనే వచ్చింది. అలా తమ రెస్టారెంట్ ప్రారంభమైందని చెప్పుకొచ్చాడు చైతూ. ఇక ఇప్పుడు తమ రెస్టారెంట్ విజయవంతంగా మూడుపువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందని చైతన్య పేర్కొన్నారు.
- April 26, 2025
0
87
Less than a minute
Tags:
You can share this post!
editor

