టాలీవుడ్ హీరో మహేష్‌బాబు రియల్ ఎస్టేట్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన క్రమంలో, రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదులో మహేష్‌బాబు పేరును చేర్చారు. ఒక డాక్టర్, ఫోరంలో ఫిర్యాదు చేస్తూ.. బ్రోచర్‌లో మహేష్‌బాబు ఫొటోతో ఉన్న వివరాలను చూసి బాలాపూర్ గ్రామంలో లేఔట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ప్రతి ప్లాట్‌కు రూ.34.80 లక్షలు చెల్లించిన తర్వాత, అసలు ఆ లేఔట్‌కు అనుమతులు లేవని తేలిందని తెలిపారు. డబ్బు తిరిగి ఇవ్వాలని డెవలపర్స్‌ను ఒత్తిడి చేయగా, సంస్థ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా కేవలం రూ.15 లక్షల వరకే వాపసు ఇచ్చారని బాధితులు వివరించారు. ఈ నేపధ్యంలో ఫోరం.. సాయిసూర్య డెవలపర్స్, సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా, ప్రచారకర్త మహేష్‌బాబులను ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు జూలై 8 సోమవారం నాటికి వ్యక్తిగతంగా లేదా వారి లాయర్ల ద్వారా వినియోగదారుల ఫోరంలో హాజరుకావల్సిందిగా సూచించింది. ఇందులో మహేష్‌బాబుని మూడో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. మరి దీనిపై మహేష్‌బాబు ఏమైన స్పందిస్తాడా అనేది వెయిట్ అండ్ సీ..

- July 7, 2025
0
56
Less than a minute
Tags:
You can share this post!
editor