ప్రముఖ డైరెక్టర్‌ షాజీ ఎన్ క‌రుణ్‌ కన్నుమూత

ప్రముఖ  డైరెక్టర్‌  షాజీ  ఎన్  క‌రుణ్‌  కన్నుమూత

ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు షాజీ ఎన్ క‌రుణ్‌ (73) క‌న్నుమూశారు. మలయాళ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఈ ద‌ర్శ‌కుడు గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌పడుతూ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. క్యాన్సర్‌ బారిన పడిన ఆయన కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి క‌న్నుమూసిన‌ట్టు తెలుస్తోంది. పిర‌వి అనే సినిమాతో ఆయన ద‌ర్శ‌కుడిగా మారారు. మొదటి సినిమాతోనే అందరి నుండి ప్రశంసంలు అందుకున్న ఆయ‌న‌ ఈ సినిమాతోనే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా ద‌క్కించుకున్నారు. షాజీ మ‌ల‌యాళ సినిమాకి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించింది. అలానే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జెసి డేనియల్ అవార్డుతో సత్కరించింది. షాజీ ఎన్ కరుణ్ 1952లో జన్మించారు. ఆయన పల్లిక్కరలో స్కూల్, తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీలో విద్య‌న‌భ్య‌సించారు.

editor

Related Articles