తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్, రెవెన్యూ షేరింగ్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించబోమంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక విలువలకు ప్రతిబింబంగా నిలుస్తూ, వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతోందని నూతన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ రంగాన్ని అడ్డుపెట్టుకుని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలను అస్సలు సహించబోమని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజల అభిరుచి, కళాకారుల హక్కులు, అలాగే పరిశ్రమలో ఉన్న శ్రమజీవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సమస్యలకు కారకులు ఎవ్వరైనా సరే, వారిని వదిలిపెట్టేది లేదు అని ఆయన తేల్చిచెప్పారు.

- May 24, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor