హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా పెట్టిన పోస్ట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించేలా ఉంది. ఎన్టీఆర్ మరో రెండు రోజుల్లో తన పుట్టినరోజు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్.. అతడి సినిమాల అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తారక్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా వార్ 2 నుండి బర్త్‌డే నాడు స్పెషల్ అప్‌డేట్ ఉండబోతోందని అటు హృతిక్ రోషన్‌తో పాటు ఇటు చిత్రనిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ ఇప్పటికే ప్రకటించాయి. అయితే వార్ 2తో పాటు తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ అనే సినిమాకు సంబంధించి కూడా అప్‌డేట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ తారక్ బర్త్‌డే నాడు డ్రాగన్ నుండి ఎటువంటి అప్‌డేట్ ఉండదని మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించింది.
- May 17, 2025
0
130
Less than a minute
Tags:
You can share this post!
editor

