నితిన్ ‘త‌మ్ముడు’ సినిమా రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల‌..

నితిన్ ‘త‌మ్ముడు’ సినిమా రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల‌..

టాలీవుడ్​ స్టార్ హీరో నితిన్ ‘తమ్ముడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. చివ‌రిగా రాబిన్ హుడ్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా త‌మ్ముడు సినిమా చేశారు. ఇది జులై 4న గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్​ స్పీడ్ పెంచారు. ఇంట‌ర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా సినిమాపై ఆస‌క్తిని క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో రెండు రోజుల‌లో త‌మ్ముడు సినిమా విడుద‌ల కానుండ‌గా, చిత్ర బృందం రిలీజ్ ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది. నేను పుట్టిన‌ప్పుడే మా అమ్మ చ‌నిపోయింది.. అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. నాకు అమ్మ అయిన నాన్న అయిన అన్నీ మా అక్కే అనే డైలాగ్ ఈ సినిమా సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో రూపొందుతోంది అని తెలియ‌జేస్తుంది. ట్రైల‌ర్ ఎమోష‌న్స్, యాక్ష‌న్‌తో నిండిపోయింది. సినిమాపై భారీ అంచ‌నాలే పెంచింది. ఈ సినిమా నితిన్‌కి త‌ప్ప‌క మంచి హిట్ ఇస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందులో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాశిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సినిమాలో నితిన్‌కి అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ న‌టిస్తుండ‌గా, ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. సినిమాకి సంబంధించిన విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ఈ ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. పవన్​కు వీరాభిమాని అయిన నితిన్ ఇదే టైటిల్​తో సినిమా చేశారు. సినిమా టైటిల్ ఒక్కటే అయినప్పటికీ స్టోరీలు మాత్రం వేర్వేరుగా ఉండనున్నాయి.

editor

Related Articles