‘పూరి సేతుప‌తి’ సినిమాలో హీరోయిన్‌గా నిహారిక?

‘పూరి సేతుప‌తి’ సినిమాలో హీరోయిన్‌గా నిహారిక?

సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ నిహారిక ఎన్ఎమ్ క్రేజీ పాన్ ఇండియా సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తికి హీరోయిన్‌గా ఆమె క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ, నిహారిక ఎన్ఎమ్ ఇటీవ‌లే త‌మిళంలో ‘పెరుసు’ సినిమాతో న‌టిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ మ‌ల్టీ లింగ్వ‌ల్ ప్రాజెక్ట్‌లో ఆమెకు కీల‌క పాత్ర‌లో అవ‌కాశం వ‌చ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. నిహారిక ఎన్ఎమ్ సోష‌ల్ మీడియాలో త‌న కంటెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు భారీ సంఖ్య‌లో ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త‌ల‌తో అభిమానులు, సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆమె న‌టిగా కెరీర్‌లో ఎదగడానికి మ‌రో ముఖ్య‌మైన అడుగు కానుంది. పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 2025 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

editor

Related Articles