వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ‘90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు గెలుచుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్ వివరాలు ఇప్పటికే మంచి అంచనాలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఆర్‌కే సినీప్లెక్స్ లో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ప్రాజెక్ట్ పై యూత్ లో భారీ ఆసక్తి నెలకొని ఉండగా, మరిన్ని అప్డేట్స్ ను మూవీ టీం త్వరలో రివీల్ చేయనుంది.
- December 2, 2025
0
49
Less than a minute
You can share this post!
editor


