రామోజీ ఫిల్మ్‌ సిటీలో బాలయ్యపై కొత్త షెడ్యూల్..?

రామోజీ ఫిల్మ్‌ సిటీలో బాలయ్యపై కొత్త షెడ్యూల్..?

హీరో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, రీసెంట్‌గా జార్జియాలో పోరాటాలు పూర్తిచేశారు బాలయ్య. మరో కొత్త షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో ఈ రోజు నుండి ఈ కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. దీనిలో భాగంగా బాలకృష్ణతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.

editor

Related Articles