కొత్త సినిమా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’

కొత్త సినిమా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’

‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ పేరుతో ఓ భిన్నమైన ప్రేమకథ తెరకెక్కబోతోంది. తోట రామకృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ్‌ మీనన్‌, దిలీప్‌ హీరోలుగా, రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఇదొక కళాశాల నేపథ్యంలో సాగే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ అనీ, యువతను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని దర్శక, నిర్మాత తోట రామకృష్ణ తెలిపారు. రఘుబాబు, కశిరెడ్డి రాజ్‌కుమార్‌, వీరశంకర్‌, గౌతంరాజు, రాకెట్‌ రాఘవ, గుండు సుదర్శన్‌, రవితేజ, రజిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: శ్రీనివాసరాజు, సంగీతం: మోహిత్‌ రహమానియాక్‌.

editor

Related Articles