దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్‌ను నయనతార తన కుటుంబంతో కలిసి సందర్శించారు. భర్త విఘ్నేష్ శివన్, ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగ్‌తో కలిసి ఆదివారం ఈ ప్రఖ్యాత కట్టడాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు, అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, నయన్.. తమిళ స్టార్ ధనుష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో వచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీని నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- November 18, 2024
0
117
Less than a minute
Tags:
You can share this post!
administrator


