జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28 మందికి పైగా పర్యాటకులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించడంతో పాటు కశ్మీర్‌కు అండగా నిలుస్తుండగా.. తాజాగా ఈ ఘటనపై స్పందించాడు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ ఘటనపై మన ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. మనమందరం అదే ఆశిస్తున్నాం. జరిగింది నిజంగా చాలా విషాదకరం. ఇది సిగ్గుచేటు, అని ఆయన అన్నారు. ఈ ఘటనతో పర్యాటక రంగం బాగా దెబ్బతింది. కానీ అంతకంటే ఎక్కువ, అక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఎందుకంటే మేమందరం సోదరులం. కాశ్మీర్ ప్రజలు సందర్శకులను స్వాగతించే విధానం డబ్బుకు మించింది. అక్కడ నేను ఎంతో ప్రేమను చూశాను. కాశ్మీరీల హృదయాలలో మనందరి కోసం ఉన్న ప్రేమను నేను వర్ణించలేను. అక్కడికి ప్రయాణించేవారు తిరిగి వచ్చినప్పుడు కాశ్మీరీలను ఎంతో ప్రశంసిస్తారు. వారు నిజంగా దానికి అర్హులు.
- April 29, 2025
0
90
Less than a minute
Tags:
You can share this post!
editor

