దర్శకుడు మణిరత్నం మళ్లీ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన రోజా, బొంబాయి, గీతాంజలి, ఓకే బంగారం, తదితర సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే నవీన్ ఇటీవల యాక్సిడెంట్ కావడంతో చేతికి దెబ్బతగిలింది. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే నవీన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా అనగనగా ఒకరాజు. మీనాక్షి చౌదరీ ఈ సినిమాలో కథనాయికగా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం నవీన్ మణిరత్నం సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

- February 21, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor