టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్‌డమ్” గురించి అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ టీజర్ గ్లింప్స్‌తో సాలిడ్ హైప్ అందుకున్న ఈ సినిమాకి సంగీతం అనిరుధ్ సమకూరుస్తున్నాడని తెలిసిందే. సగం హైప్ ఇక్కడే సినిమాకి సొంతం కావడం విశేషం. అయితే తన నుండి వచ్చే పాటలు వినేందుకు కూడా చాలామంది ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా తాలూకు ఆడియో హక్కులకు సంబంధించి ఇప్పుడు అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఆడియో హక్కులని ప్రముఖ ఆడియో లేబుల్ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టుగా లేటెస్ట్‌గా రివీల్ చేశారు. సో ఇక నుండి కింగ్‌డమ్ బీట్స్ అన్నీ ఆదిత్య మ్యూజిక్ నుండి వినవచ్చు అని చెప్పాలి. ఇక ఈ సినిమాని కూడా నిర్మాతలు రెండు భాగాలుగా ప్లాన్ చేసి నిర్మాణం చేపట్టారు.

- February 21, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor