ఆ మధ్య నరేష్-పవిత్ర లోకేష్ జంట మీడియాలో ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవిత్రతో నరేష్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళుతున్నారు. ఎవరు ఏమి అనుకున్నా, తప్పుడు ప్రచారాలు చేసినవారు లైట్ తీసుకున్నారు. నరేష్ మూడో భార్య పెద్ద హంగామా చేసిన కూడా నరేష్.. పవిత్రని వదిలి పెట్టలేదు. వారిద్దరు చక్కగా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నరేష్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. తన ఎక్స్‌లో పవిత్రతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. ఎవరో తెలియని మహిళ మాకు గిఫ్ట్ ఇచ్చి షాక్ అయ్యేలా చేసిందని అన్నారు. వెకేషన్‌కి వెళ్లేందుకు నరేష్, పవిత్ర హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లగా, అక్కడ వారిద్దరిని చూసిన మహిళ వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్‌ను బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ‘ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను చూసి.. ఆమెపై మీరు చూపించే శ్రద్ధ, ప్రేమ బాగుంది. ఆమెని అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకుంది. మీరు ఒక గొప్ప మనిషి. అయితే ఆ సమయంలో ఆమె ముఖంలోని నిజాయితీ నచ్చింది.
- May 22, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor

