ఘనంగా నారా రోహిత్‌ – శిరీషల వివాహం..

ఘనంగా నారా రోహిత్‌ – శిరీషల వివాహం..

హీరో నారా రోహిత్, శిరీషల వివాహం గురువారం రాత్రి 10.35 గంటలకు అజీజ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం. అలాగే మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మాణి, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులతో పాటు నందమూరి–నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వివాహ వేదిక పూలతో, లైటింగ్‌లతో శోభాయమానంగా అలంకరించబడింది. రోహిత్–శిరీషల జంటకు అభిమానులు, బంధుమిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

editor

Related Articles