తమిళం నుండి వచ్చి సూపర్ హిట్ అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు హీరో నాని ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. ‘సింపుల్‌గా ఉండి, హృదయపూర్వకంగా.. ఎంతో మంచిని పంచే సినిమాలు మనకు కావాలి. టూరిస్ట్ ఫ్యామిలీ – అలాంటి సినిమా. ఈ అద్భుతమైన సినిమాను రూపొందించిన నటీనటులకు, చిత్రబృందానికి ధన్యవాదాలు. ఇది చాలా అవసరం’. అంటూ నాని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ చూసిన టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ నాని ప్రశంసలకు బదులిస్తూ “సర్, ఇది పూర్తిగా ఊహించనిది! మీరు చూపిన ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు. మీ ట్వీట్ నిజంగా మా రోజును అద్భుతంగా మార్చింది! మేము మరింత కృతజ్ఞతగా, చాలా ప్రేరణతో ఉన్నాము అంటూ రాసుకొచ్చాడు. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. నటులు యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా.. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు.
- May 27, 2025
0
54
Less than a minute
Tags:
You can share this post!
editor

