టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేర’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. అలాగే, రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’లోనూ నాగార్జున ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలలో నటిస్తున్న నాగార్జున తదుపరి సినిమాపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, నాగార్జున ఇటీవల ఒక యువ తమిళ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ‘నిథం ఓరు వానమ్’ (తెలుగులో ఆకాశం) సినిమా ఫేం కార్తీక్ నాగ్‌కి కథ వినిపించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై చిత్ర నిర్మాతలు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
- May 13, 2025
0
181
Less than a minute
Tags:
You can share this post!
editor

