తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో అక్కినేని నాగార్జున చెప్పిన చివరి స్టేట్‌మెంట్ రికార్డ్ అయ్యింది. బుధవారం నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలసి నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. సురేఖ తమ కుటుంబంపై చేసిన అభ్యంతరకర, నిరాధార వ్యాఖ్యలతో తమకు తీవ్రమైన అవమానం జరిగిందని, మనోవేదనకు లోనయ్యామని నాగార్జున పేర్కొన్నారు. తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న విషయాలకు సంబంధించి ఛానెల్స్‌లో ప్రసారమైన వీడియోలు, పత్రికల్లో వచ్చిన కథనాలను నాగార్జున కోర్టులో సమర్పించారు. ఈ నెల 24 నుండి ఈ కేసు ట్రయల్ ప్రారంభమవనుంది. తదుపరి విచారణలో నాగార్జునను క్రాస్ ఎగ్జామినేషన్ వాదనలు చేపట్టనున్నారు.
- September 4, 2025
0
122
Less than a minute
You can share this post!
editor

