Movie Muzz

ఏఎన్ఆర్ కళాశాలపై సంచలన నిర్ణయం… మొత్తం ఎంతంటే?

ఏఎన్ఆర్ కళాశాలపై సంచలన నిర్ణయం… మొత్తం ఎంతంటే?

నటసామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఐదవ తరగతి వరకే చదువుకున్నారు. కానీ, ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడే వారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట గుడివాడలో ఒక కళాశాల వుంది. దానికొక ఘనమైన చరిత్ర వుంది. 1959లో ఆ కళాశాల నిర్మాణానికి అక్కినేని నాగేశ్వరరావు లక్ష రూపాయలు ఇచ్చారు. అప్పట్లో లక్ష అంటే ఇప్పుడు ఎన్నో కోట్లు. గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో చదివిన వాళ్ళు అనేకమంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు! చాలామంది అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు! ఆ తరువాత ఆ కళాశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు. అది వేరే విషయం కానీ, 66 ఏళ్ల క్రితం అక్కినేని ఇచ్చిన ఆ లక్ష వల్ల ఇన్నేళ్లు అయినా ఆ కళాశాలకు గొప్ప గుర్తింపు. ఎందరో ఉన్నత విద్య చదువుకోగలిగారు, చదువుకున్నారు, చదువుకుంటున్నారు. సరే..
నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు, సిబ్బందికి ఒక చిరస్మరణీయ క్షణాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,.. తన తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్ఆర్ కళాశాలలో 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నిర్ణయం తాను, తన సోదరి సుశీల, సోదరుడు వెంకట్,  మొత్తం ఏఎన్ఆర్ కుటుంబం కలిసి తీసుకున్నట్లు తెలిపారు.

editor

Related Articles