అక్కినేని నాగచైతన్య 25వ సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య తన 25వ సినిమా చేయనున్నారు. ఇప్పటికే శివ నిర్వాణ చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పేశారు. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నది. నాగచైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలీ’ సినిమా విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా కూడా మంచి విజయాన్ని సాధించింది. వీరిద్దరు రెండోసారి కలిసి పనిచేస్తున్న ఈ సినిమా ‘మజిలీ’ని మించిన ఎమోషన్స్‌తో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం శివ నిర్వాణ డైలాగ్ వెర్షన్‌ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.
- June 20, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor

