నాగచైతన్య, సాయిపల్లవి తండేల్‌..

నాగచైతన్య, సాయిపల్లవి తండేల్‌..

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య -సాయిపల్లవితో వస్తోన్న సినిమా తండేల్‌. చందూ మొండేటి డైరెక్షన్‌లో రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైలెస్సో హైలెస్సా పాటను రిలీజ్ చేశారని తెలిసిందే. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కాలేజ్‌ విద్యార్థినితో కలిసి డ్యాన్స్‌ చేసిన నిర్మాత అల్లు అరవింద్‌. సంప్రదాయ లంగావోణిలో ఉన్న ఓ అమ్మాయి స్టేజ్‌పైకి వచ్చి హైలెస్సో హైలెస్సా పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. అల్లు అరవింద్‌ ఆమెతో కలిసి హుక్‌ స్టెప్ వేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను దేవిశ్రీప్రసాద్‌ కంపోజిషన్‌లో శ్రేయా ఘోషల్‌, నకాష్‌ అజీజ్‌ పాడారు. 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న తండేల్ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

editor

Related Articles