రవితేజ మాస్‌ జాతర గ్లింప్స్ వచ్చేస్తోంది..

రవితేజ మాస్‌ జాతర గ్లింప్స్ వచ్చేస్తోంది..

టాలీవుడ్‌ హీరో రవితేజ  కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా రవితేజ 75 (RT75). మాస్ జాతర టైటిల్‌తో రాబోతోంది. డ్యాన్సింగ్ క్వీన్‌ శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రవన్న మాస్ దావత్ షురూ రా భయ్. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర మాస్‌ ర్యాంపేజ్‌ గ్లింప్స్ రాబోతోందంటూ కొత్త లుక్ షేర్ చేశారు. రవితేజ భోజనం చేసేందుకు కూర్చుని కోర మీసం మెలేస్తూ కనిపిస్తున్నాడు. అభిమానులు, ఫాలోయర్లకు కావాల్సిన పసందైన విందు భోజనంలా మాస్ జాతర ఉండబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాతో సామజవరగమన ఫేం రైటర్‌ భాను బొగ‌వరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజపూజ్యం అన్ లిమిటెడ్.. అవమానం జీరో అంటూ ఇప్పటికే ఓ అప్‌డేట్ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి బ‌ల‌గం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 

editor

Related Articles