ఎలాంటి హడావిడి లేకుండా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్. ఈ సినిమా ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తొలి రోజునే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ అంతా కూడా విపరీతంగా కలెక్షన్స్ రాబడుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలని సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “లిటిల్ హార్ట్స్ అద్భుతమైన సినిమా. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా చాలా బాగుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్, డైరెక్షన్, మేకింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూడండి!” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కు చిత్ర బృందం స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. హీరో మౌళి తనూజ్.. “థ్యాంక్స్ అన్నా… మీలాంటి స్టార్ నుండి మా సినిమాపై ట్వీట్ రావడం గర్వంగా ఉంది. ఇప్పుడు ఈ ఆనందం సెలబ్రేట్ చేసుకోవడానికి మీ ‘షోయు’ (నాగ చైతన్య రెస్టారెంట్) నుండి ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి!” అని సరదాగా రిప్లై ఇచ్చారు. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ కూడా చైతన్యకు ధన్యవాదాలు చెబుతూ, “మీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్లీ మిమ్మల్ని రొమాంటిక్ కామెడీలో చూడాలని ఎదురుచూస్తున్నాం” అంటూ స్పందించారు. అక్కినేని సుమంత్ కూడా ‘లిటిల్ హార్ట్స్’పై ప్రశంసలు కురిపించారు. చాలా సరదాగా ఉంది. థియేటర్‌లో ఫుల్ గా నవ్వుకున్నా. బ్లాక్ బస్టర్ హిట్ కు అభినందనలు! అంటూ ట్వీట్ చేశారు.

- September 11, 2025
0
34
Less than a minute
You can share this post!
editor