టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్ కొత్తగా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లు చేసే గ్లామర్ ఫొటోలకంటే డిఫరెంట్‌గా, కారు మెకానిక్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం కావస్తున్నా ఇంకా అవకాశాల కోసం తంటాలు పడుతూనే ఉంది. కన్నడ కస్తూరి నభా నటేష్. అందం, అభినయం అన్నీ ఉన్నా ఆ రేంజ్‌లో ఛాన్సులు దక్కించుకోలేక నంబర్ గేమ్‌లో ఎప్పుడూ వెనుకబడే ఉంటోంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటోంది.
రెండేళ్లుగా ఒళ్లు దాచుకోకుండా ఫొటోషూట్లు చేస్తున్నప్పటికీ అవకాశాలు ఇచ్చే వారే కరువయ్యారు. మాతృభాష కన్నడను కాదని తెలుగు మీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టిన ఈ హీరోయిన్ అశలన్నీ అడియాశలౌతున్నాయి. గత సంవత్సరం ప్రియదర్శి హీరోగా వచ్చిన డార్లింగ్ సినిమాతో అలరించిన ఈ హీరోయిన్ మరలా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించలేదు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ సినిమా మాత్రమే చేతిలో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇతర హీరోయిన్లు తరుచూ చేసే ఫొటోషూట్లలా కాకుండా కాస్త రూట్ మార్చి ఓ డిఫరెంట్ స్టైల్‌లో, ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఫొటో షూట్ చేసి ఔరా అనిపించింది.
