హిందీ హీరోయిన్‌ని విమ‌ర్శించిన మృణాల్‌..

హిందీ హీరోయిన్‌ని విమ‌ర్శించిన మృణాల్‌..

తెలుగు ప్రేక్షకుల మదిలో సీతా మహాలక్ష్మిగా నిలిచిన మృణాల్ ఠాకూర్, ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. అక్కినేని సుమంత్‌తో పెళ్లి అంటూ వచ్చిన గాసిప్స్‌కి, ధనుష్‌తో డేటింగ్ అంటూ బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టిన వార్తలకు క్లారిటీ వచ్చినట్లు కనిపించినా… తాజాగా ఆమె పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి మళ్లీ చర్చనీయాంశంగా మారింది. “బిపాసా కంటే నేనే అందంగా ఉంటాను” అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మృణాల్ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ కెరీర్ ప్రారంభించిన కాలంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో బిపాసా బసుపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఎవరైనా కండలు తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే… బిపాసాను చేసుకోండి! నేను బిపాసా కంటే బెటర్‌గా ఉంటాను. ఆడవాళ్లు తనలా నాజూగ్గా ఉండాలని.. బిపాసా మాదిరి కండలు తిరిగిన వారిలా ఉండకూడదని.. ఆమెను చూస్తే మగవాడిలా అనిపిస్తుంద‌ని మృణాల్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

editor

Related Articles