సోషల్ మీడియాలో ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు రాధాకృష్ణ కుమార్, హను రాఘవపూడిలకు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం తీసిన ఈ వీడియోలో వీరిద్దరూ ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వద్ద సహాయ దర్శకులుగా పనిచేస్తున్న రోజుల నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాధాకృష్ణ కుమార్ రచయితగా ‘ప్రయాణం’, ‘సాహసం’ సినిమాలకు పనిచేశారు. అనంతరం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘జిల్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
మరోవైపు హను రాఘవపూడి ‘అందాల రాక్షసి’, ‘పడిపడి లేచే మనసు’, ‘సీతారామం’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పీరియాడిక్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వీరిద్దరి కెరీర్ ప్రారంభ దశలోని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.

