సినిమా ‘జూనియర్‌’ హంగామా

సినిమా ‘జూనియర్‌’ హంగామా

కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. జులై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. జీవితాన్ని సరదాగా, ఆనందంగా గడిపే యువకుడిగా హీరో కిరీటి పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం హైలెట్‌గా నిలిచాయి. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, జీవిత లక్ష్యం పట్ల స్పష్టత ఉన్న ఓ యువకుడి కథగా మెప్పిస్తుందని దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. జెనీలియా, రవిచంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సంభాషణలు: కళ్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని.

editor

Related Articles