అమ్మ నిజంగా దేవకన్యనే..!

అమ్మ నిజంగా దేవకన్యనే..!

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’  సినిమా ఇటీవలే రీ-రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన తల్లి, దివంగత శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ ఆమెకు నివాళిగా జాన్వీకపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ పోస్టర్స్‌ ముద్రించిన డెనిమ్‌ జాకెట్‌ను ధరించి.. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘కొద్దిరోజుల క్రితమే రీ-రిలీజ్‌ వెర్షన్‌ను చూశాను. అద్భుతంగా అనిపించింది. అమ్మను చూస్తుంటే నిజంగా దేవకన్యలా అనిపించింది. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలు అబ్బురపరిచాయి. చిరంజీవి  కామెడీ హైలెట్‌. ఇంత గొప్ప సినిమాని అందించిన దర్శకులు రాఘవేంద్రరావు గారి విజన్‌కు హ్యాట్సాఫ్‌’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం జాన్వీకపూర్‌ తెలుగులో ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది.

editor

Related Articles