మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన హిట్ సినిమా ‘తుడరుమ్ తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ సినిమా మే 30, 2025 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన జియో సినిమాలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా, ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ ఏడాది మార్చి 27న ఎంపురాన్ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మోహన్ లాల్ ఆ సినిమా తర్వాత నెలరోజులు కూడా గ్యాప్ తీసుకోకుండానే తుడరుమ్‌ని విడుదల చేశాడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకి క్యూ కట్టారు. విడుదలైన మొదటిరోజు నుండే హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టడమే కాకుండా కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ‘తుడరుమ్’ సినిమాకి థరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో మోహన్‌లాల్ సరసన శోభన నటించింది.
- May 27, 2025
0
71
Less than a minute
Tags:
You can share this post!
editor

