మోహన్‌ లాల్‌ బర్త్‌ డే స్పెషల్‌..

మోహన్‌ లాల్‌ బర్త్‌ డే స్పెషల్‌..

టాలీవుడ్‌ యాక్టర్‌ మంచు విష్ణు ‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ప్రాజెక్ట్‌ కన్నప్ప. మాలీవుడ్ మోహన్‌లాల్ కిరాట పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మోహన్‌ లాల్‌కు మేకర్స్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ముఖేష్‌కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే లాంచ్‌ చేసిన టీజర్‌తోపాటు కీ రోల్స్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మోహన్‌లాల్ కిరాట పాత్రలో నటిస్తున్నాడు. మోహన్‌లాల్ కిరాట అవతారంలో విల్లు చేతబట్టి తన సైన్యంతో కొండల్లో నుండి నడుచుకుంటూ వస్తోన్న విజువల్స్‌ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. కిరాట పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్‌. కన్నప్ప సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

editor

Related Articles