మిస్ ఇండియా టైటిల్ విన్నరే.. ‘దేవకీనందన వాసుదేవ’లో సత్యభామ

మిస్ ఇండియా టైటిల్ విన్నరే.. ‘దేవకీనందన వాసుదేవ’లో సత్యభామ

“నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇక్కడే ఇంజనీరింగ్‌ చదివాను. కొన్నాళ్లు కార్పొరేట్‌ జాబ్‌ కూడా చేశాను. తర్వాత మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచాను. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఇండియాను రిప్రజెంట్‌ చేశాను. ఆ తర్వాత సినిమా వర్క్‌ షాప్‌కి వెళ్లాను. అక్కడే యాక్టింగ్‌పై ఇష్టం మొదలైంది. కాన్ఫిడెంట్‌ పెరిగింది. కొన్ని ఆడిషన్స్‌ కూడా ఇచ్చాను. అలా ‘దేవకీనందన వాసుదేవ’లో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. నా తెలుగు ఎంట్రీ ఇలాంటి మంచి సినిమాతో కావడం చాలా ఆనందంగా ఉంది’ అని మానస వారణాసి అన్నారు. మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. దర్శకుడు ప్రశాంత్‌వర్మ కథతో, అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఈ నెల 22న విడుదల కానుంది. మానస వారణాసి సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. తొలి సినిమాకే ఇలాంటి కథ, క్యారెక్టర్‌ దొరకడం నిజంగా అదృష్టం. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ. విజయనగరం అమ్మాయిని. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ పాత్ర చేశాను. అశోక్‌ చాలా ప్రొఫెషనల్‌. అతనికి సినిమా అంటే పాషన్‌. సెట్స్‌లో ప్రతి విషయాన్నీ షేర్‌ చేసుకునేవారు’ అని తెలిపింది. భీమ్స్‌ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.

administrator

Related Articles