‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ తాజాగా బంఫర్ ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీ ప్రయాణంలో భాగమవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. నన్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించిన దర్శకుడు గుర్మీత్ సింగ్, నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని సోనాల్ రాసుకొచ్చింది.
- October 28, 2025
0
47
Less than a minute
You can share this post!
editor

