‘మిరాయ్’ ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే అంత?

‘మిరాయ్’ ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే అంత?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రిలీజ్‌కి రాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్‌గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ సినిమా “మిరాయ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ నెల 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా రిలీజ్‌కి ముందే పెట్టిన బడ్జెట్‌తో పెద్ద మొత్తంలోనే కేవలం ఓటిటి, శాటిలైట్ హక్కులతో రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 60 కోట్లకి పైగా బడ్జెట్ పెడితే అందులో 45 కోట్లు మొత్తం ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే వచ్చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మిరాయ్‌కి నెలకొన్న డిమాండ్ ఏ లెవెల్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్ విలన్‌గా నటించాడు.

editor

Related Articles