అల్లు ఫ్యామిలీ వేడుక‌లో మెగా కుటుంబం..

అల్లు ఫ్యామిలీ వేడుక‌లో మెగా కుటుంబం..

మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరుగుతోంది! హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. తన ప్రేయసి, బిజినెస్ ఫ్యామిలీకి చెందిన నయనిక రెడ్డితో ఆయన నిశ్చితార్థం శుక్రవారం (అక్టోబర్ 31) హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ – నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శిరీష్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి డెనిమ్ జాకెట్, జీన్స్‌తో సూప‌ర్ లుక్‌లో ఉండగా.. రామ్ చరణ్ – ఉపాసన, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంప‌తులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

editor

Related Articles