మాస్ జాతర – యాక్షన్ డ్రామా!

మాస్ జాతర – యాక్షన్ డ్రామా!

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నేడు సినిమా హాల్స్‌లో వేశారు. మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సినిమా కథ చదివి తెలుసుకుందాం!
కథ : లక్ష్మణ్‌భేరి (రవితేజ) ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతన్ని తన తాత (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీస్‌గా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లక్ష్మణ్‌భేరి, అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఆ ఊరిలో శివుడు (నవీన్‌చంద్ర) గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు చేసే పనులకు లక్ష్మణ్‌భేరి అడ్డు నిలుస్తాడు. అసలు శివుడు వెనుక ఉన్నది ఎవరు?, వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, ఈ మధ్యలో తులసి (శ్రీలీల) తో లక్ష్మణ్ భేరి ప్రేమ కథ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. మొత్తం తెలుసుకోవాలంటే సినిమా ఒకసారి చూస్తే సరి.

editor

Related Articles