విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్‌..!

విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్‌..!

మోహన్ బాబు కుటుంబంలో మరోసారి గొడవలు మొదలైనాయి. మంచు విష్ణుపై పహాడీషరీఫ్‌ పోలీసులకు మనోజ్‌ ఫిర్యాదు చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌, విజయ్‌, కిరణ్‌, రాజ్‌ కొండూరు, శివ, మన్నూరులపై పోలీసులకు మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏడు అంశాలపై ఏడు పేజీల ఫిర్యాదు కాపీని మనోజ్‌ పోలీసులకు అందించారు. ఫిర్యాదులో తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని మనోజ్‌ పేర్కొన్నారు. తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని.. బయటపెట్టినందుకు తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. తనను చంపుతానని బెదిరించారని.. నా ఇంటికి కరెంట్‌ కట్‌ చేయమని విద్యుత్‌ శాఖకు తన పేరుతో ఫేక్‌ లెటర్‌ రాశారన్నారు. తన ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారని.. ఇంట్లో చొరబడి సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు హార్డ్‌ డిస్క్‌ దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఇటీవల మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేసుకున్నారు.

editor

Related Articles