మంచు మ‌నోజ్ ‘భైరవం’ సినిమా ప్రమోషన్‌లో…

మంచు మ‌నోజ్ ‘భైరవం’ సినిమా ప్రమోషన్‌లో…

మ‌నోజ్ త‌న సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. మ‌నోజ్ భైరవం సినిమాలో న‌టించ‌గా, ఇందులో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లు కూడా ముఖ్య పాత్ర‌లు పోషించారు. విజయ్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమా మ‌ల్టీ స్టార‌ర్ సినిమాగా  తెర‌కెక్కించ‌గా, ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. సినిమా గురించి చెబుతూ ఆ టైంలో తన ఇంట్లో జరిగిన గొడవల గురించి కూడా ప్రస్థావించాడు. మధ్యలో విష్ణు మీద కూడా పరోక్షంగా కౌంటర్లు వేశాడు. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చాను.. కొత్త సినిమాను స్టార్ట్ చేశాను.. రీ లాంచ్ అనుకున్నాను.. కరోనా వచ్చింది.. ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది.. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.. కొంద‌రు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఇంకా సినిమాలు చెయ్ అన్నా.. కమ్ బ్యాక్ ఇవ్వు అని అంటున్నారు.. ఆ ప్రేమకు నేను సినిమాతోనే సమాధానం ఇస్తాను.. అలానే శివయ్యా అని పిలిస్తే ఆ శివుడు రాడు.. మనసులో తలుచుకుంటే.. మా డైరెక్టర్ లానో, మా నిర్మాతలానో వస్తాడు.. మా మీద నమ్మకంతో 50 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు అని మ‌నోజ్ చెప్పుకొచ్చారు.

editor

Related Articles