పూరి సేతుప‌తి సినిమాలో మ‌ల‌యాళీ బ్యూటీ సంయుక్త మీనన్

పూరి సేతుప‌తి సినిమాలో మ‌ల‌యాళీ బ్యూటీ సంయుక్త మీనన్

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ప్ర‌స్తుతం త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తితో ఒక సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. పూరిసేతుప‌తి అంటూ ఈ సినిమా రాబోతుండ‌గా.. ‘పూరి కనెక్ట్స్’ బ్యాన‌ర్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి ట‌బు ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం వెల్ల‌డించింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ‌రో హీరోయిన్‌ను ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఈ సినిమాలో మ‌ల‌యాళీ బ్యూటీ సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త ఫొటోను షేర్ చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాని భారీస్థాయిలో నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల జూన్ చివ‌రిలో ప్రారంభమవుతుందని సమాచారం.

editor

Related Articles