ఈ మధ్య తరచుగా ఓ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతోంది. అందుకు కారణం లేకపోలేదు.. ఆమె నిత్యం అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని వేడెక్కించేస్తోంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక మీనన్. ఈ రోజుల్లో అందాల ముద్దుగుమ్మలు గ్లామర్ షో చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా ఆఫర్స్ తగ్గిన సమయంలో నిత్యం అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే గ్లామర్ షో సమయంలో కొందరు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మాళవికని దారుణంగా ట్రోల్ చేయడంతో ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ” నేను ఒక్క దానినే అందాలు ఆరబోయడం లేదు.. మిగతా హీరోయిన్స్ కూడా అదే చేస్తున్నారంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- November 5, 2025
0
40
Less than a minute
You can share this post!
editor

