మాళవిక మోహనన్ మలయాళ హీరో మమ్ముట్టిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వంటి హీరో చేత ఆడిషన్ చేయించుకునే భాగ్యం ఎవరికైనా దక్కుతుందా అని ప్రముఖ హీరోయిన్ మాళవికా మోహనన్ అన్నారు. ‘పేట’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్… ఆ తర్వాత ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి హిట్ సినిమాల్లో నటించారు. అయితే, ఆమె తొలిసారి దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘పట్టంపోలే’ అనే సినిమాలో నటించారు. ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ కుమార్తె అయినప్పటికీ ఆమెకు కూడా ఆడిషన్ తప్పలేదు. ఈ ఆడిషన్ కు ఆమెకు సహకరించిన నటుడు మమ్ముట్టి. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పైగా ఆడిషన్ సమయంలో మమ్ముట్టి తీసిన ఫొటోను ఆమె షేర్ చేసి, ‘ఎవరికైనా ఇలాంటి అవకాశం లభిస్తుందా? కానీ, నాకు లభించింది. ‘పట్టంపోలే’ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా నన్ను ఓ షూటింగ్ లొకేషన్ లో మమ్ముట్టి చూసి, అక్కడే ఆడిషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోలు తీశారు. ఆయనే నాకు తొలి సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నేను అడుగుపెట్టాను’ అని ఆమె పాత ఙ్ఞాపకాలను వివరించారు. మాళవిక ప్రస్తుతం తెలుగులోనూ నటిస్తోంది. ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది.
- September 11, 2025
0
154
Less than a minute
You can share this post!
editor


