కెన్యా అడవుల్లో మహేష్ పోరాటాలు?

కెన్యా అడవుల్లో మహేష్ పోరాటాలు?

ఎస్‌.ఎస్‌.రాజమౌళి  ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గానే షూటింగ్‌ కూడా మొదలైంది. మరి విడుదలెప్పుడు? అనేది ఇంకా కరెక్ట్‌గా చెప్పలేం. సినీప్రియులైతే ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా వెయ్యికోట్ల ఖర్చుతో నెవ్వర్‌ బిఫోర్‌ అనేలా బిగ్గెస్ట్‌ పాన్‌వరల్డ్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. అవి కూడా చిన్న షెడ్యూల్సే. అయితే.. ఈసారి మాత్రం భారీ షెడ్యూల్‌ని కెన్యా అడవుల్లో జక్కన్న ప్లాన్‌ చేశారట. ఈ షెడ్యూల్‌లోనే హీరో హీరోయిన్లు మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా పాత్రల ఇంట్రడక్షన్‌ కూడా ప్లాన్‌ చేశారట. అంతేకాకుండా, కథలో మేజర్‌ ట్విస్ట్‌ని కూడా ఈ షెడ్యూల్‌లోనే షూట్‌ చేస్తారట. ఈ క్రమంలో రూపొందించే భారీ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సీన్స్‌ కోసం భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఇంటర్నేషనల్‌ టెక్నికల్‌ క్రూ పనిచేస్తున్నదట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే హై రేంజ్‌లో ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రెజర్‌ హంట్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తుండగా, మాధవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: కె.ఎల్‌.నారాయణ.

editor

Related Articles