పాకిస్తాన్ పాప‌తో మ‌హేష్‌బాబు కొడుకు చెట్టపట్టాలు..

పాకిస్తాన్ పాప‌తో మ‌హేష్‌బాబు కొడుకు చెట్టపట్టాలు..

పహల్గాం ఉగ్రదాడిని భార‌తీయులు అంత ఈజీగా మ‌రిచి పోలేక‌పోతున్నారు. పాకిస్తాన్‌కి త‌గిన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్థాన్‌ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లకు ఈ నిర్ణ‌యం కొంత రుచించ‌డం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే బోర్డ‌ర్‌లో ఏ స‌మ‌యంలోనైనా యుద్ధం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇంత వివాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌హేష్ బాబు కొడుకు గౌత‌మ్ పాకిస్తాన్ అమ్మాయితో చెట్టప‌ట్టాలు వేసుకుని తిరుగుతుండ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం విదేశాల‌లో చ‌దువుకుంటున్న గౌత‌మ్.. అప్పుడ‌ప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అల‌రిస్తున్నాడు. ఆ మ‌ధ్య త‌న స్నేహితుల‌తో క‌లిసి గౌత‌మ్ చేసిన వీడియో బాగా వైర‌ల్ అయింది. అది చూసి గౌత‌మ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంద‌ని, తండ్రిని మించిన త‌న‌యుడు అవుతాడ‌ని కొంద‌రు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌత‌మ్ ఇండియ‌న్ జెర్సీ ధ‌రించి పాక్ జెర్సీ ధ‌రించిన అమ్మాయితో షికార్లు కొడుతున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయిన అందులోని దృశ్యాలు, టీ ష‌ర్ట్‌పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి.

editor

Related Articles