ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి సిద్ధం..

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి సిద్ధం..

తెలుగు సినీ ప్రపంచంలో మరో స్టార్ వారసుడు తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. ఇక జయకృష్ణ తొలి సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ ఎంపికైందని సమాచారం. రవీనా టాండన్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియని వారుండరు. బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’, నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’, మోహన్‌బాబుతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లాంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఆమె కూతురు రషా తడానీ తెరంగేట్రం చేయనుంది. రషా ఇప్పటికే బాలీవుడ్‌లో నటన ప్రారంభించింది. జనవరిలో విడుదలైన హిందీ సినిమా ‘ఆజాద్’ ద్వారా అజయ్ దేవ్‌గణ్ కుమారుడు అమన్ దేవ్‌గణ్ సరసన హీరోయిన్‌గా నటించి, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ కొత్త జంటను వెండితెరపై పరిచయం చేయనున్నాడు. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఒక్క సినిమాతో రెండు సినీ కుటుంబాల వారసుల్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. జయకృష్ణ డెబ్యూట్, రషా మొదటి తెలుగు సినిమా కావడంతో సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

editor

Related Articles