ప్రశాంత్‌వర్మ నుండి వచ్చిన ‘హనుమాన్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతోంది. అయితే ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతున్న మరో సినిమా ‘మహాకాళి’. పూజ అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఇండియా నుండి వస్తున్న తొలి ఫిమేల్ సూపర్ హీరో సినిమా ఇదే కావడం విశేషం. ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ రోల్‌లో నటిస్తున్న హీరోయిన్ ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. కన్నడ నటి భూమిశెట్టి ఈ సినిమాలో మహాకాళి పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో మహాకాళిగా భూమిశెట్టి ఉగ్ర రూపంలో కనిపిస్తోంది. ఈ సినిమాకి సంగీతం: స్మరణ్‌సాయి, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.
- October 30, 2025
0
35
Less than a minute
You can share this post!
editor

