మలయాళ, తమిళ సినిమాలతో గుర్తింపు పొందిన మడొన్నా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాతో ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకుంది. తెలుగులో ఆమె రెండు సినిమాల్లో నటించింది, అందులో ఒకటి ప్రేమమ్ రీమేక్, రెండోది నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన మడొన్నా, సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే మడొన్నాకి సినిమా అవకాశాలు రాకపోయినా కూడా పెద్దగా గ్లామర్ షో చేయదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అందరు షాక్‌కు గురయ్యేలా చేసింది. పొట్టి బట్టలు ధరించి గ్లామర్ షో చేసిన ఫొటో చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ ఆమెను ట్యాగ్ చేస్తూ అసభ్యమైన కామెంట్లు చేశారు.
ఈ విషయంపై మడొన్నా స్పందిస్తూ, “గ్లామర్ షో చేయడం తప్పు కాదు.. కానీ గ్లామర్‌కు, అసభ్యతకు మధ్య వ్యత్సాసం ఏంటనేది తెలిస్తే చాలు.. అది నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నానో నాకు అర్ధమవుతుంది.. అంటూ కౌంటరిచ్చింది.

