షూటింగ్ కంప్లీట్ చేసిన ‘ప‌రాశ‌క్తి’

షూటింగ్ కంప్లీట్ చేసిన ‘ప‌రాశ‌క్తి’

ఇటీవ‌ల మ‌ద‌రాసి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న‌టుడు శివ కార్తికేయ‌న్ త‌న త‌దుప‌రి సినిమా ప‌రాశ‌క్తిని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్న విష‌యం తెలిసిందే. సుధా కొంగ‌ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా శ్రీలీల హీరోయ‌న్‌గా నటిస్తోంది. రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి, బేసిల్ జోసెఫ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పొంగ‌ల్ కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

editor

Related Articles