‘లిటిల్ హార్ట్స్’ అనగానే ‘ప్రేమించుకుందాం రా’ సినిమా గుర్తుకు వచ్చింది. అందులో వెంకటేష్ చేతిలో ఉన్న లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ మదిలో మెదిలింది. టీజర్ చాలా బావుంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనిపిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌లో సినిమా రూపొందింది. సెప్టెంబర్ 12న నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న అనిల్ రావిపూడి, టీజర్‌ని విడుదల చేసి మాట్లాడారు. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇదని హీరో మౌళి చెప్పారు. రెండు గంటలపాటు ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని దర్శకుడు తెలిపారు.

- August 21, 2025
0
43
Less than a minute
Tags:
You can share this post!
editor