లారెన్స్ స్వచ్ఛంద సేవ.. వికలాంగురాలికి సొంత ఇల్లు..

లారెన్స్ స్వచ్ఛంద సేవ.. వికలాంగురాలికి సొంత ఇల్లు..

న‌టుడు రాఘ‌వ లారెన్స్ గురించి తమిళ, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న న‌టుడిగా క‌న్నా కూడా సామాజిక సేవ‌ల‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. తాజాగా, శ్వేత అనే దివ్యాంగురాలి‌కి చేసిన సాయం ప‌ట్ల‌ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కటిక పేదరికంలో జీవిస్తున్న శ్వేత అనే యువతి, అనారోగ్యం కారణంగా నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న లారెన్స్, మొదట వీల్ చైర్ స్కూటీని బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా, ఆమె నడవడానికి కృత్రిమ కాలును ఏర్పాటు చేయించి, అవసరమైన వైద్య సహాయం అందించారు. ఇప్పుడు ఆమెకు సొంతంగా ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. శ్వేతకు ఓ సురక్షితమైన గృహం అవసరం. ఆమెకు సొంతిల్లు కట్టించడమే నా తదుపరి లక్ష్యం అని లారెన్స్ ప్రకటించారు. అందుకు ముందుగా కొంత భాగం అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు. ఈ వార్త నెట్టింట్లో వైరల్ కాగా, నెటిజన్లు ‘హ్యాట్సాఫ్ లారెన్స్ అన్నా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

editor

Related Articles