లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్‌ల సినిమా ‘సతీ లీలావతి’

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్‌ల సినిమా ‘సతీ లీలావతి’

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సతీ లీలావతి సినిమా షూటింగ్  సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాతినేని సత్య దర్శకుడు. నాగ మోహన్‌బాబు ఎమ్, రాజేష్ టి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ ఇవ్వగా, వరుణ్ తేజ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నాం. చక్కటి కథతో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. సోమవారం నుండే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి సంగీతం- మిక్కీ జే మేయర్.

editor

Related Articles